ప్రచురించబడిన తేది : 15-Nov-21
శ్రీమతే రామానుజాయ నమ: --ఆస్తికుడు నాస్తికుడు మద్య సంక్రాంతి చర్చ-- ఆస్తికుడు: "సంక్రాంతి శుభాకాంక్షలు రా" నాస్తికుడు: "ఏంది రా ఈ సంక్రాంతి లొల్లి" ఆస్తికుడు: "గొబ్బెమ్మలు,భొగి మంటలు,రంగవల్లులు,ఆడపడుచులు,గంగిరెద్దులు,హరిదాసులు. చక్కినాలు,అరిసెలు,కర్జకాయలు,కారప్పూసలు" నాస్తికుడు: "చెల్ ,పండగంటె తిండేనార బూకరోడ,అసలు సంక్రాంతి ఎందుకొ చెప్పు" ఆస్తికుడు: "పైనున్న నింగిలొ రాశులు పన్నెండు కుంటి సారధి తోని వస్తడంట ఆ రేడు" నాస్తికుడు: "ఎవల్రా?" ఆస్తికుడు: "సూర్యుడెహె!" "మేక రాశి కొచ్చి ,పంటలన్నీచేతికిచ్చి ,పరమాన్నం తింటడంట" నాస్తికుడు:"అహా ఇంకా" ఆస్తికుడు:" ఏంకన్నాసామి లేచి,భక్తులను చూస్తడంట ,ఆండాళ్ళు అమ్మతోని లగ్గమెట్టుకుంటడంట" నాస్తికుడు:"అబ్బోఅయినా నేను దేవుడిని నమ్మ కదా,నాకెందుకీ లొల్లి" ఆస్తికుడు:"కాలమంత కష్టం తో,చెమట నీటి చుక్కలతో కరకు కండలు కరగించి,పండించిన పంట చూసి అన్నదాత మొఖమున నవ్వు చూసే రోజు" "ఎండుగడ్డి,చెరుకుముక్క,మామిడాకు,ఆవుపేడ, మనిషి మంచికిమచ్చుతునకలు , ఆనందపువెలుగు రేఖలు , రాజుకైన ఆకలి తీర్చె, రైతన్నకు శిరసువంచి పసిడి పంటలనిచ్చె భూమి తల్లికి నమస్కరించి ప్రకృతిని ప్రేమించేప్రతి మనిషి కళ్ళల్లొవెలిగేదేఈ కాంతి ప్రశ్నలన్ని పక్కనెట్టి నలుగురితొ చేసుకోర సంక్రాంతి" నాస్తికుడు:"అట్లనా! సమజైంది. అయితే నీకు కూడ సంక్రాంతి శుభాకాంక్షలు రా "